ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > వార్తలు > విండీస్ టూర్‌కు జట్టు ప్రకటన: సచిన్ దూరం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
విండీస్ టూర్‌కు జట్టు ప్రకటన: సచిన్ దూరం
భారత క్రికెట్ సెలెక్టర్లు త్వరలో ప్రారంభమయ్యే వెస్టిండీస్ వన్డే సిరీస్ కోసం టీం ఇండియాను ఎంపిక చేసింది. బీసీసీఐ సెలెక్షన్ కమిటీ బుధవారం ప్రకటించిన ఆటగాళ్ల బృందంలో సచిన్ టెండూల్కర్, జహీర్ ఖాన్, వీరేంద్ర సెహ్వాగ్, సురేష్ రైనా రూపంలో నలుగురు ప్రధాన క్రికెటర్లను పక్కనబెట్టారు.

సచిన్ టెండూల్కర్, జహీర్ ఖాన్‌లకు సెలెక్టర్లు విశ్రాంతి కల్పించగా, భుజం గాయంతో ట్వంటీ- 20 ప్రపంచకప్‌కు అందుబాటులోలేని సెహ్వాగ్ తాజా వన్డే సిరీస్ కూడా దూరమయ్యాడు. సురేష్ రైనా కూడా గాయంతో బాధపడుతుండటంతో వెస్టిండీస్ టూర్‌కు పక్కనబెట్టారు. సచిన్ చేతివేలి గాయంతో బాధపడుతూ తనను సెలెక్షన్‌కు పరిగణించవద్దని బోర్డును కోరాడు.

ఇదిలా ఉంటే జహీర్ ఖాన్ స్థానంలో ఢిల్లీ పేస్ బౌలర్ ఆశిష్ నెహ్రా జట్టులోకి వచ్చాడు. బీసీసీఐ తాజాగా ప్రకటించిన 16 మంది భారత ఆటగాళ్ల బృందంలో అభిషేక్ నాయర్, ఎం విజయ్, రవీంద్ర జడేజా‌లు కూడా చోటు దక్కించుకున్నారు. విండీస్‌తో వన్డే సిరీస్ ఈ నెల 26న ప్రారంభమవుతుంది. సిరీస్‌లో మొదటి రెండు వన్డేలు జమైకాలో, మిగిలిన రెండు సెయింట్ లూసియాలో జరుగుతాయి.

వెస్టిండీస్‌లో పర్యటించే భారత జట్టు:
మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), యువరాజ్ సింగ్ (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, గౌతం గంభీర్, యూసఫ్ పఠాన్, ఎస్ బద్రీనాథ్, హర్భజన్ సింగ్, ప్రజ్ఞాన్ ఓజా, ఇషాంత్ శర్మ, ప్రవీణ్ కుమార్, ఆర్పీ సింగ్, ఆశిష్ నెహ్రా, ఎం విజయ్, అభిషేక్ నాయర్, రవీంద్ర జడేజా.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
బ్యాటింగ్ వైఫల్యమే పరాజయానికి కారణం
వెస్టిండీస్ టూర్‌కు నేడు భారత జట్టు ఎంపిక
ట్వంటీ- 20 ఫైనల్స్‌లోకి వెళతాం: మిథాలీ
వెస్టిండీస్ టూర్‌కు టెండూల్కర్ అనుమానం
కిర్‌స్టన్ వ్యాఖ్యలపై మండిపడ్డ బీసీసీఐ
ఫిట్‌నెస్‌లేని ఆటగాళ్లను ఎంపిక చేశారు: ధోనీ