దక్షిణాఫ్రికాను తాజాగా మరో ప్రపంచకప్‌లోనూ దురదృష్టం వెంటాడింది. ఒత్తిడికిగురై కీలక మ్యాచ్‌లను చేజార్చుకుంటారనే పేరును దక్షిణాఫ్రికా జట్టు ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ఐసీసీ ప్రపంచకప్‌లోనూ నిలబెట్టకుంది. పాకిస్థాన్‌తో జరిగిన ట్వంటీ- 20 ప్రపంచకప్ సెమీస్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఏడు పరుగుల తేడాతో పరాజయం పాలై టోర్నీ నుంచి ఒట్టిచేతులతో వెనుదిరిగింది.
ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా జట్టు పరాజయం పాలైన మ్యాచ్ ఇదొక్కటే. పరాజయం ఒక్కటైనా మూల్యం మాత్రం పెద్దదే. ప్రపంచకప్ గెలిచే అన్ని అర్హతలు ఆ జట్టుకు ఎప్పటి నుంచో ఉన్నాయి. వన్డే, ట్వంటీ- 20 ప్రపంచకప్‌లలో సెమీస్‌లో దక్షిణాఫ్రికా జట్టు పరాజయం పాలవడం ఇది తొలిసారేమీ కాదు. గతంలో అనేకసార్లు ఈ జట్టు సెమీస్ దశలో అనవసరపు ఒత్తడికి లోనై లేదా దురదృష్టంతో ఇంటిముఖం పట్టింది.
తాజా సెమీస్ మ్యాచ్‌లో చేతిలో ఐదు వికెట్లున్నా ఏడు పరుగులు చేయలేక దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. దీంతో "చకర్స్ (ఒత్తిడికి లోనయ్యే బలహీనత)" పేరుకు మరో సాక్ష్యాన్ని మిగిల్చారు. ఇదిలా ఉంటే 1996, 1999, 2003, 2007 వన్డే ప్రపంచకప్‌ల సెమీస్ దశ నుంచి దక్షిణాఫ్రికా ఇంటిముఖం పట్టింది. తాజాగా రెండు ట్వంటీ- 20 ప్రపంచకప్‌ల సెమీస్‌లోనూ దక్షిణాఫ్రికా పరాజయం పాలైంది. వీటితోపాటు ఐసీసీ ఇతర భారీ టోర్నీల్లోనూ దక్షిణాఫ్రికాకు ఇదే పరిస్థితి పలు సందర్భాల్లో ఎదురైంది. |