ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరాశపరిచిన టీం ఇండియా త్వరలో వెస్టిండీస్‌తో జరగబోతున్న నాలుగు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు సమాయత్తమవుతోంది. ఈ వన్డే సిరీస్ కోసం ఇప్పటికే కరేబియన్ దీవుల్లోకి అడుగుపెట్టిన టీం ఇండియా సభ్యులు తొలి శిక్షణా కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని భారత బృందం కింగ్‌స్టన్‌లో ప్రాక్టీస్ సెషన్ ప్రారంభించింది. కిర్‌స్టన్ ఆధ్వర్యంలో టీం ఇండియా సభ్యులు శిక్షణ, నెట్‌సెషన్‌లో పాల్గొన్నారు. సిరీస్‌లో తొలి రెండు వన్డే మ్యాచ్‌లు కింగ్‌స్టన్‌లోని సబీనా పార్కులో శుక్ర, ఆదివారాల్లో జరుగుతాయి. ఇదిలా ఉంటే వెస్టిండీస్ వన్డే జట్టులో భాగమైన కెప్టెన్ క్రిస్ గేల్ సహా ఐదుగురు సభ్యులు ఇంగ్లాండ్ పర్యటనను ముగించుకొని స్వదేశానికి వచ్చారు. |