పాకిస్థాన్ టెస్ట్ జట్టులో సీనియర్ బ్యాట్స్‌మెన్ మొహమ్మద్ యూసఫ్‌కు చోటు లభించింది. పాకిస్థాన్ సెలెక్టర్లు శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్ జట్టులో యూసఫ్‌కు చోటు కల్పించారు. ఇదిలా ఉంటే వివాదాస్పద ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్‌కు మాత్రం సెలెక్టర్లు మొండిచెయ్యి చూపించారు.
గత ఏడాది ఇండియన్ క్రికెట్ లీగ్‌లో చేరిన మొహమ్మద్ యూసఫ్ పాకిస్థాన్ జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు. అయితే ఇటీవల ఐసీఎల్‌తో ఒప్పందం రద్దు చేసుకోవడంతో, అతను తిరిగి జాతీయ జట్టులోకి వచ్చేందుకు మార్గం సుగమమైంది. ఇప్పటికే ఐసీఎల్‌తో ఒప్పందం రద్దు చేసుకున్న అబ్దుల్ రజాక్‌కు జాతీయ జట్టులో చోటు లభించింది.
రజాక్ ఇంగ్లాండ్‌లో జరిగిన ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్‌లోనూ ఆడాడు. గజ్జల్లో గాయం నుంచి కోలుకొని తిరిగి ప్రాక్టీసు మొదలుపెట్టిన అక్తర్‌కు మాత్రం శ్రీలంకతో టెస్ట్ సిరీస్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసిన 15 మంది ఆటగాళ్ల బృందంలో చోటు లభించలేదు. పాక్ జట్టులోకి తిరిగి వచ్చినందుకు యూసఫ్ సంతోషం వ్యక్తం చేశాడు. యూసఫ్ తన కెరీర్‌లో ఇప్పటివరకు 79 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. |