వెస్టిండీస్‌లో జరిగే నాలుగు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం కరేబియన్ దీవులకు వెళ్లాల్సిన ముగ్గురు టీం ఇండియా సభ్యులకు వీసా సమస్యలు ఎదురయ్యాయి. ట్రాన్సిట్ వీసా సమస్యలతో వారు ఇప్పటికీ వెస్టిండీస్ బయలుదేరి వెళ్లాల్సి ఉంది.
అభిషేక్ నాయర్ (ముంబయి), మురళీ విజయ్ (తమిళనాడు), సుబ్రమణ్యం బద్రీనాథ్‌లు వెస్టిండీస్- భారత్ వన్డే సిరీస్‌కు జట్టులో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. లండన్ మీదగా వెస్టిండీస్ వెళ్లేందుకు ట్రాన్సిట్ వీసా లభించకపోవడంతో ఈ ముగ్గురు ఆటగాళ్లు ఇబ్బంది పడుతున్నారు.
వారికి మంగళవారం వీసాలు లభించే అవకాశం ఉంది. ఈ రోజు రాత్రి వారు వెస్టిండీస్ బయలుదేరి వెళతారని, బుధవారం సాయంత్రానికి జమైకా చేరుకుంటారని బోర్డు వర్గాలు తెలిపాయి.
జూన్- 26న వెస్టిండీస్, భారత్ జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. సిరీస్‌లో తొలి రెండు వన్డేలు జమైకాలోని కింగ్‌స్టన్‌లో జరుగుతాయి. వీసా సమస్యలు ఎదురుకావడంతో ఈ ముగ్గురు ఆటగాళ్లు అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు అతితక్కువ సమయంలో మాత్రమే ఉంది. |