వెస్టిండీస్‌తో జరిగే నాలుగు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే వన్డే ర్యాంకింగ్స్‌లో టీం ఇండియా రెండో స్థానానికి ఎగబాకుతుంది. వెస్టిండీస్- భారత్ వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ శుక్రవారం కింగ్‌స్టన్‌లో జరగనుంది. ఈ సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లలోనూ టీం ఇండియా విజయం సాధిస్తే, తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాను టీం ఇండియా కిందకు నెడుతుంది.
ఆస్ట్రేలియా, భారత్ ఖాతాలో 122 పాయిట్లు ఉన్నప్పటికీ, దశాంశ పద్దతిలో టీం ఇండియాపై ఆస్ట్రేలియా కాస్త మెరుగ్గా ఉంది. తాజా వన్డే సిరీస్‌లో టీం ఇండియా క్లీన్‌స్వీప్ చేస్తే ఆస్ట్రేలియాను మూడో స్థానానికి పడిపోతుంది.
అప్పుడు ఆస్ట్రేలియా కంటే టీం ఇండియా ఖాతాలో ఒక పాయింట్ ఎక్కువ ఉంటుంది. ఇదిలా ఉంటే సిరీస్‌లో 3-1 విజయం సాధిస్తే టీం ఇండియా ఒక పాయింట్ కోల్పోయి ఆస్ట్రేలియా వెనుక నిలబడాల్సి వస్తుంది. 2-2తో డ్రా అయితే టీం ఇండియా పాయింట్లు 119కి పడిపోతాయి. ఇలా కాకుండా తాజా వన్డే సిరీస్‌ను వెస్టిండీస్ క్లీన్‌స్వీప్ చేస్తే టీం ఇండియా ఖాతాలో 116 పాయింట్లు మాత్రమే మిగులుతాయి. |