మోకాలి గాయం కారణంగా యాషెస్ సిరీస్ కోసం ప్రకటించిన ఇంగ్లండ్ జట్టులో మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్‌కు చోటు లభించలేదు. దీంతో అన్ని రకాలుగాను వాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేందుకు రంగం సిద్ధమైనట్లు బ్రిటిష్ మీడియా అభిప్రాయపడింది.కొందరు కీలక యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం కోసం ఈ వారం చివరలో 34 ఏళ్ల వాన్ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని బ్రిటిష్ డైలీ పత్రిక తెలిపింది. 2005 చారిత్రక యాషెస్ సిరీస్ నెగ్గిన జట్టుకు వాన్ సారథ్యం వహించాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో వచ్చేందుకు ఈ ఏడాది తీవ్రంగా శ్రమించాడు. దీనికి తోడు ఇటీవల జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంలో వాన్ ఎంపిక కాలేదు.వారం ముందు ప్రీ-యాషెస్ సిరీస్ కోసం ప్రకటించిన 16 మంది సభ్యులు గల ఇంగ్లండ్ జట్టులోను వాన్ స్థానం కోల్పోయాడు. 2005 యాషెస్ సిరీస్ నెగ్గిన తర్వాత వాన్ కెరీర్‌కు మోకాలి గాయం రూపంలో పెద్ద ఎదరుదెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. ఎందుకంటే.. ప్రస్తుతం వాన్ గాయానికి తప్పనిసరిగా శస్త్రచికిత్స అవసరమవుతుందని ఇప్పటికే వైద్యులు తేల్చి చెప్పారు.ఇంగ్లండ్‌కు చెందిన అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా తారాపథానికి దూసుకెళ్లిన వాన్ అనూహ్యంగా గాయం కారణంగా ఫిట్‌నెస్ సమస్యలతో, పేలవ ప్రదర్శనతో జట్టులో స్థానం కోల్పోయాడని క్రికెట్ పండితులు అభిప్రాపడ్డారు. తాను ఫిట్‌గా ఉన్నానని వాన్ ప్రకటించినప్పటికీ ఇటీవల జరిగిన సీజన్‌లో రోజు మొత్తం ఫీల్డింగ్ చేయలేకపోతున్నాడన్నది వారి వాదన. అదలా ఉంచితే.. ఇప్పటి వరకు 82 టెస్ట్ మ్యాచ్‌ల్లో.. 51 మ్యాచ్‌లకు.. అలాగే 86 వన్డే మ్యాచ్‌లలో.. 60 మ్యాచ్‌లకు వాన్ సారథ్యం వహించాడు. |