ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఒలింపిక్ క్రీడల్లో ట్వంటీ-20 క్రికెట్‌ను చేర్చాలన్న ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ అభిప్రాయానికి పాకిస్థాన్ లెజండ్ మియాందాద్ మద్దతు పలికాడు. ఈ పొట్టి క్రికెట్‌కు లభిస్తున్న ప్రేక్షకుల మద్దతును దృష్టిలో ఉంచుకుని ఒలింపిక్ క్రీడాల్లో చేర్చాలని ఈ మాజీ కెప్టెన్ అభిప్రాయపడ్డాడు.
హైదరాబాద్ డెక్కన్ ఛార్జర్ జట్టు కెప్టెన్‌గా వ్యవహిస్తున్న గిల్లీ... ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఒలింపిక్ క్రీడల్లో ట్వంటీ-20 క్రికెట్‌ను చేర్చేందుకు అవసరమైన అన్ని చర్యలను ఐసీసీ చేపట్టాలని సూచించాడు. క్రికెటేతర దేశాల్లో కూడా ఈ క్రీడకు ప్రాచూర్యం కల్పించేందుకు ఇదో మంచి అవకాశమన్నాడు. ఈ కలను నెరవేర్చేందుకు ఒలింపిక్ వేదిక సరైనదిగా గిల్లీ పేర్కొన్నాడు.
దీనికి పాక్ మాజీ కెప్టెన్ మియాందాద్ కూడా మద్దతు తెలిపాడు. ఒక రోజు పాటు సాగే 50 ఓవర్ల మ్యాచ్ లేదా ఐదు రోజుల పాటు సాగే టెస్టు మ్యాచ్‌లను ఒలింపిక్ క్రీడల్లో చేర్చలేమన్నారు. అయితే, ట్వంటీ-20కి లభిస్తున్న ఆదరణ, రెండు ప్రపంచ ట్వంటీ-20 కప్‌లు, ఐసీఎల్, ఐపీఎల్ టోర్నీల నిర్వహణను పరిగణంలోకి తీసుకుని ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్‌ను చేర్చేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చాడు.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు డైరక్టర్ జనరల్‌గా నియమితులైన మియాందాదా, చైనాకు క్రికెట్ రాయబారిగా జావెద్ వ్యవహిస్తాడు. ట్వంటీ-20 టోర్నీని ఒలింపిక్స్, ఆసియా, కామన్వెల్త్ వంటి ప్రతి అంతర్జాతీయ క్రీడల్లో చేర్చాలని అభిప్రాయపడ్డాడు. |