అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య "హాల్ ఆఫ్ ఫేం" జాబితాలో ముగ్గురు భారతీయ క్రికెటర్లకు స్థానం దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా 55 మంది దిగ్గజ క్రికెటర్లతో ఈ జాబితాను తాజాగా విడుదల చేశారు. ఇందులో ఆల్ టైం దిగ్గజాలైన బిషన్ సింగ్ బేడీ, సునీల్ గవాస్కర్, కపిల్‌దేవ్‌లు మాత్రమే ఉన్నారు.
ఇంగ్లండ్ నుంచి అత్యధికంగా 22 మందికి 'హాల్ ఆఫ్ ఫే' గౌరవం దక్కింది. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ అసోసియేషన్ (ఫిసా)కు అనుబంధంగా నిర్వహించే హాల్ ఆఫ్ ఫేంలో ఆరంభం నుంచి క్రికట్‌కు సేవలు విశేష సేవలు అందించిన వారికి చోటు కల్పించడం ఆనవాయితీగా వస్తోంది.
ఫిసా తొలి ఛైర్మన్‌గా విధులు నిర్వహించిన ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కాలిన్ కౌడ్రీకి గౌరవసూచకంగా ఈ జాబితాలో చోటు కల్పించారు. శత వార్షికోత్సవాలను జరుపుకుంటున్న ఐసీసీ ప్రస్తుత జాబితాలో చోటు లభించిన వారికి దశల వారీగా గౌరవ క్యాప్‌లు అందజేసి సత్కరించనుంది. |