ఇంగ్లాండ్‌లో జరిగిన ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్‌లో సత్తాచాటిన పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ ఉమర్ గుల్ త్వరలో శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్‌లోనూ తన తడాకా చూపేందుకు సన్నద్ధమవుతున్నాడు. శ్రీలంక పర్యటనకు బయలుదేరి వెళుతున్న సందర్భంగా ఉమల్ గుల్ కరాచీలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డును దక్కించుకోలేకపోయానని నిరాశ వ్యక్తం చేశాడు.
అయితే తాజా శ్రీలంక సిరీస్‌లో టైటిల్ గెలుచుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని గుల్ పేర్కొన్నాడు. నాలో ఇప్పుడు సంపూర్ణ ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. తన ప్రస్తుత ఫామ్, ఫిట్‌నెస్ 110 శాతం రాణించేందుకు ఉపయోగపడతాయని చెప్పాడు. అందుకే మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌పై దృష్టిపెట్టానన్నాడు. ఈ సిరీస్‌లో పాకిస్థాన్ కోసం పూర్తి సత్తా చాటేందుకు ఎదురుచూస్తున్నానని గుల్ పేర్కొన్నాడు.
ఇటీవల ముగిసిన ట్వంటీ- 20 ప్రపంచకప్‌లో ఆడిన 21 మ్యాచ్‌లలో ఉమర్ గుల్ మొత్తం 37 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు. శ్రీలంకలో పరిస్థితులు ఇంగ్లాండ్‌కు భిన్నంగా ఉంటాయని, ఇక్కడ రాణించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందని గుల్ తెలిపాడు. పాక్ ఆటగాళ్లు ట్వంటీ- 20 నుంచి త్వరగా టెస్ట్ క్రికెట్ పరిస్థితులకు అలవాటు పడతారని నమ్మకం వ్యక్తం చేశాడు. కొలంబోలో పాక్ జట్టు సోమవారం వార్మప్ మ్యాచ్ ఆడబోతుంది. |