ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > వార్తలు > రిటైర్మెంట్ వార్తలకు ఆజ్యం పోసిన వాన్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రిటైర్మెంట్ వార్తలకు ఆజ్యం పోసిన వాన్
మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ మైకెల్ వాన్ మంగళవారం విలేకరుల సమావేశంలో పాల్గొంటాడని ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఓ ప్రకటన విడుదల చేసింది. 34 ఏళ్ల మైకెల్ వాన్ క్రికెట్‌‍కు పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు గత కొంతకాలంగా మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజా విలేకరుల సమావేశంలో వాన్ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది.

ఈ ఏడాది యాషెస్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ బోర్డు ప్రకటించిన జట్టులో మైకెల్ వాన్‌కు చోటు లభించని సంగతి తెలిసిందే. దీంతో అతను క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే వార్తలు జోరందుకున్నాయి. ఆస్ట్రేలియాపై చాలాకాలం నుంచి యాషెస్ సిరీస్ విజయం కోసం ఎదురుచూస్తున్న ఇంగ్లాండ్‌‍కు వాన్ ఆ కల నేరవేర్చాడు.

2005లో యాషెస్ సిరీస్ కైవసం చేసుకున్న ఇంగ్లాండ్ జట్టుకు వాన్ కెప్టెన్ కావడం గమనార్హం. ఆ సమయంలో వాన్ ఇంగ్లాండ్‌లో తిరుగులేని క్రికెటర్‌గా ప్రశంసలు అందుకున్నాడు. 2003 సమయంలో ప్రపంచంలో అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్‌గా వెలుగొందాడు. అయితే ఇటీవలి సంవత్సరాల్లో వరుసగా గాయాలతో బాధపడుతున్న వాన్ తన కెరీర్‌లో 82 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
భారతీయుల చెత్తషాట్ల కోసం ఎదురుచూశా
మమ్మల్ని విస్మరించారు: పాకిస్థాన్ సెలెక్టర్లు
శ్రీలంకలో పూరిస్థాయిలో రాణిస్తా: గుల్
"హాల్ ఆఫ్ ఫేం" జాబితాలో ముగ్గురు ఇండియన్స్
గిల్లీ అభిప్రాయానికి మియాందాద్ మద్దతు
ప్రతీకారం తీర్చుకున్న విండీస్: సిరీస్ సమం