ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > వార్తలు > రామ్‌పాల్, టేలర్‌లే విజయానికి కారణం: గేల్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రామ్‌పాల్, టేలర్‌లే విజయానికి కారణం: గేల్
టీం ఇండియాతో కింగ్‌స్టన్‌లో సబైనా పార్కులో ఆదివారం జరిగిన రెండో వన్డేలో తమ విజయానికి ఫాస్ట్ బౌలర్లు రవి రామ్‌పాల్, జెర్మే టేలర్‌లే కారణమని వెస్టిండీస్ కెప్టెన్ క్రిస్ గేల్ చెప్పాడు. రెండో వన్డేలో వెస్టిండీస్ ఎనిమిది వికెట్ల తేడాతో టీం ఇండియాపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో నాలుగు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను వెస్టిండీస్ 1-1తో సమం చేసింది.

ఈ మ్యాచ్ అనంతరం వెస్టిండీస్ కెప్టెన్ క్రిస్ గేల్ మాట్లాడుతూ.. రామ్‌పాల్ (4-37), టేలర్ (3-35)లు కొత్త బంతితో చెలరేగారని చెప్పాడు. వారి విధ్వంసకర బౌలింగ్ ముందు భారత బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడంతో టీం ఇండియా 188 పరుగులకే పరిమితమైంది. స్వల్ప లక్ష్యాన్ని వెస్టిండీస్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది.

గేల్ (64), రునాకో మోర్టాన్ (85) తొలి వికెట్‌కు 101 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించారు. మంచి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సిరీస్‌ను సమం చేయడంపట్ల గేల్ సంతోషం వ్యక్తం చేశాడు.

రామ్‌పాల్, టేలర్‌లే మ్యాచ్‌ను తమవైపు తిప్పారు. సిరీస్‌లో పట్టుబిగించేందుకు ప్రయత్నిస్తామన్నాడు. ప్రారంభంలో పిచ్‌పై ఉన్న తేమను ఈ ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు సమర్థవంతంగా ఉపయోగించుకున్నారని గేల్ ప్రశంసించాడు. రామ్‌పాల్ ఈ రెండో వన్డేలో కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసుకున్నాడు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
సీఏ ఆదేశాలు వాళ్లని మార్చలేవు: ఇంగ్లాండ్
రిటైర్మెంట్ వార్తలకు ఆజ్యం పోసిన వాన్
భారతీయుల చెత్తషాట్ల కోసం ఎదురుచూశా
మమ్మల్ని విస్మరించారు: పాకిస్థాన్ సెలెక్టర్లు
శ్రీలంకలో పూరిస్థాయిలో రాణిస్తా: గుల్
"హాల్ ఆఫ్ ఫేం" జాబితాలో ముగ్గురు ఇండియన్స్