ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > వార్తలు > వికెట్‌ను సరిగా అర్థం చేసుకోలేదు: ధోనీ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వికెట్‌ను సరిగా అర్థం చేసుకోలేదు: ధోనీ
వెస్టిండీస్‌పై రెండో వన్డేలో టీం ఇండియా ఎనిమిది వికెట్ల తేడాతో పరాజయం పాలవడంపై జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మాట్లాడుతూ.. వికెట్‌ను సరిగా అంచనా వేయడంలో తమ బ్యాట్స్‌మెన్ విఫలం అయ్యారని చెప్పాడు. అంతేకాకుండా ప్రత్యర్థి బౌలర్లకు తగిన గౌరవం ఇవ్వలేదని ధోనీ పేర్కొన్నాడు.

రెండో వన్డేలో టీం ఇండియా ఎనిమిది వికెట్ల తేడాతో పరాజయం పాలవడంతో నాలుగు మ్యాచ్‌ల వన్డే సిరీస్ 1-1తో సమం అయింది. మ్యాచ్ పరాజయం అనంతరం ధోనీ మాట్లాడుతూ.. వికెట్‌ను సరిగా అర్థం చేసుకోలేకపోవడమే కొంపముంచిందని తెలిపాడు. తాజా మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్‌లో ధోనీ (95), యువరాజ్ (35) మినహా మిగిలినవారందరూ విఫలమయ్యారు.

దీంతో మొదట బ్యాటింగ్ చేసిన టీం ఇండియా 48.2 ఓవర్లలో 188 పరుగులు మాత్రమే చేసి ఆలౌటయింది. ఈ స్వల్ప విజయలక్ష్యాన్ని కెప్టెన్ గేల్, ఓపెనర్ మోర్టాన్ చేలరేగడంతో వెస్టిండీస్ జట్టు అలవోకగా ఛేదించింది. ఈ మ్యాచ్‌లో విండీస్ బౌలర్లకు తాము ఇంకొంత ఎక్కువ గౌరవం ఇచ్చి ఉండాల్సిందని ధోనీ చెప్పాడు. వికెట్ కొంచెం కష్టంగా ఉంది.

దీనిని సరిగా అంచనా వేయకుండా, వెళ్లి యధేచ్చగా షాట్లు ఆడాము. దీంతో ఫలితం నిరాశజనకంగా ఉందని ధోనీ పేర్కొన్నాడు. ప్రారంభంలో వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో పడ్డాము. దీంతో వెనుకబడి పోయాము. ఆర్పీ సింగ్‌తో తన భాగస్వామ్యం జట్టు కాస్త కోలుకోవడానికి దోహదపడింది. లేకుంటే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదని ధోనీ తెలిపాడు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
రామ్‌పాల్, టేలర్‌లే విజయానికి కారణం: గేల్
సీఏ ఆదేశాలు వాళ్లని మార్చలేవు: ఇంగ్లాండ్
రిటైర్మెంట్ వార్తలకు ఆజ్యం పోసిన వాన్
భారతీయుల చెత్తషాట్ల కోసం ఎదురుచూశా
మమ్మల్ని విస్మరించారు: పాకిస్థాన్ సెలెక్టర్లు
శ్రీలంకలో పూరిస్థాయిలో రాణిస్తా: గుల్