ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > వార్తలు > క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మైకెల్ వాన్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మైకెల్ వాన్
పేలవమైన ఫామ్, పదేపదే తిరగబెడుతున్న మోకాలి గాయం కారణంగా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. వాన్ మంగళవారం తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని బహిర్గతం చేశాడు. ఇంగ్లాండ్‌లో అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్‌గా గుర్తింపు పొందిన మైకెల్ వాన్ ఈ నెల 8న ప్రారంభం కాబోతున్న ఇంగ్లాండ్- ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్‌కు ఎంపిక కాలేదు.

ఈసారి యాషెస్‌లో ఆడాలని వాన్ భావించినప్పటికీ, అతనికి నిరాశే ఎదురైంది. ఫామ్‌లో లేకపోవడం, గాయాల కారణంగా గత ఏడాది ఆగస్టు నుంచి జట్టుకు దూరంగా ఉంటున్న మైకెన్ వాన్ మంగళవారం రిటైర్మెంట్ ప్రకటనను విడుదల చేశాడు.. తన రిటైర్మెంట్ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందన్నాడు. అన్ని రకాల క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు.

34 ఏళ్ల ఈ యార్క్‌షైర్ బ్యాట్స్‌మన్ 2003- 2008 మధ్యకాలంలో ఇంగ్లాండ్ సారథిగా వ్యవహరించాడు. వాన్ సారథ్యంలోనే ఇంగ్లాండ్ జట్టు 2005 యాషెస్ సిరీస్ గెలుచుకుంది. ఇంగ్లాండ్‌కు 18 ఏళ్ల తరువాత ఇదే తొలి యాషెస్ సిరీస్ కావడం గమనార్హం.

మొత్తం 51 టెస్ట్ మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్ సారథిగా ఉన్న మైకెన్ వాన్ ఆ జట్టుకు 26 విజయాలు (11 పరాజయాలు, 14 డ్రాలు) అందించాడు. ఆండ్ర్యూ స్ట్రాస్ నేతృత్వంలోని ప్రస్తుత ఇంగ్లాండ్ జట్టు త్వరలో జరిగే యాషెస్ సిరీస్‌ను కైవసం చేసుకుంటుందని నమ్మకం వ్యక్తం చేశాడు. స్ట్రాస్ సేనకు ఆ సత్తా ఉందన్నాడు. 2005నాటి యాషెస్ సిరీస్ విజయాన్ని స్ట్రాస్ బృందం పునరావృతం చేయాలని ఆకాంక్షించాడు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
40వ ఏట అడుగుపెట్టిన జయసూర్య
మిగిలిన సిరీస్‌కు విండీస్ జట్టు యథాతథం
ఇంగ్లాండ్ కెప్టెన్ అయ్యేందుకే వాన్ పుట్టాడు
ఐపీఎల్‍‌కు దూరంగా ఉండటమే ఉత్తమం
శ్రీలంక టెస్టు జట్టులో మూడు కొత్త ముఖాలు
ఏడు వేల పరుగుల క్లబ్‌లో యువరాజ్