ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > వార్తలు > యాషెస్ సిరీస్‌కు సిద్ధంగా ఉన్నా: ఫ్లింటాఫ్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
యాషెస్ సిరీస్‌కు సిద్ధంగా ఉన్నా: ఫ్లింటాఫ్
ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ ఆండ్ర్యూ ఫ్లింటాఫ్ ఆస్ట్రేలియాతో జరిగే సాంప్రదాయ యుద్ధానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య సాంప్రదాయ యాషెస్ సిరీస్ ఈ నెల 8న ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో తొలి టెస్ట్ 8న కార్డిఫ్‌లో ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఫ్లింటాఫ్ మాట్లాడుతూ.. ఈ సిరీస్‌కు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నానని చెప్పాడు.

కుడి మోకాలి గాయం కారణంగా ఇటీవల స్వదేశంలో జరిగిన ట్వంటీ- 20 ప్రపంచకప్‌కు ఫ్లింటాఫ్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ గాయం నుంచి తాను పూర్తిగా కోలుకున్నానని ఫ్లింటాఫ్ చెప్పాడు. వార్‌విక్‌షైర్‌తో ఈ వారం జరిగే మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలనుకుంటున్నట్లు తెలిపాడు.

2007 యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టుకు ఫ్లింటాఫ్ సారథ్యం వహించాడు. ఈ సమయంలో ఇంగ్లాండ్ 0-5తో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. తాజా యాషెస్ సిరీస్‌లో భాగంగా కార్డిఫ్‌లో జరిగే తొలి టెస్ట్ మ్యాచ్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు ప్రయత్నిస్తున్నానని ఫ్లింటాఫ్ తెలిపాడు. ఎనిమిది వారం క్రితం మోకాలి గాయానికి ఫ్లింటాఫ్ శస్త్రచికిత్స చేయించుకున్నాడు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మైకెల్ వాన్
40వ ఏట అడుగుపెట్టిన జయసూర్య
మిగిలిన సిరీస్‌కు విండీస్ జట్టు యథాతథం
ఇంగ్లాండ్ కెప్టెన్ అయ్యేందుకే వాన్ పుట్టాడు
ఐపీఎల్‍‌కు దూరంగా ఉండటమే ఉత్తమం
శ్రీలంక టెస్టు జట్టులో మూడు కొత్త ముఖాలు