ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > వార్తలు > అప్పటికీ, ఇప్పటికీ మార్పులేని పాంటింగ్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అప్పటికీ, ఇప్పటికీ మార్పులేని పాంటింగ్
ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ సారథ్య పగ్గాలు చేపట్టిననాటి నుంచి ఇప్పటివరకు ఏమాత్రం పరిణితి సాధించలేదని పేస్ దిగ్గజం జెఫ్ థామ్సన్ పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా రికీ పాంటింగ్ ఆస్ట్రేలియా కెప్టెన్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అతని నేతృత్వంలో ఆస్ట్రేలియా జట్టు రెండు ప్రపంచకప్‌లు కూడా గెలుచుకుంది.

అయితే అతను కెప్టెన్సీ చేపట్టినప్పుడు ఎలా ఉన్నాడో, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడని థామ్సన్ అభిప్రాయపడ్డాడు. కెప్టెన్సీ విషయంలో అతను ఏమాత్రం పరిణితి సాధించలేదని విమర్శించాడు. త్వరలో సాంప్రదాయ యాషెస్ సిరీస్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో థామ్సన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆస్ట్రేలియా మాజీ పేస్ బౌలర్ థామ్సన్ ఖాతాలో వంద యాషెస్ వికెట్లు ఉండటం గమనార్హం. యాషెస్ ప్రత్యర్థి ఇంగ్లాండ్‌పై వంద వికెట్లు పడగొట్టిన థామ్సన్ తన అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ కెరీర్‌లో మొత్తం 200 వికెట్లు దక్కించుకోగా, ఇందులో వంద వికెట్లు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌వే.

పాంటింగ్ విషయంలో తానొక్కడికే ఇటువంటి అభిప్రాయం లేదని, చాలామందికి ఇదే అభిప్రాయం కలిగివున్నారని థామ్సన్ చెప్పారు. పాంటింగ్ గొప్ప ఆటగాడు. అయితే కెప్టెన్సీ పూర్తిగా భిన్నమైంది. పాంటింగ్ కెప్టెన్‌గా ఏమాత్రం పరిణితి సాధించలేకపోయాడని పేర్కొన్నారు. 2004లో పాంటింగ్‌కు ఆస్ట్రేలియా జట్టు సారథ్య పగ్గాలు అప్పగించడాన్ని కూడా థామ్సన్ వ్యతిరేకించారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
బస్సు మిస్: ఫ్లింటాఫ్ ఈసీబీ మందలింపు
ఇంగ్లాండ్‌తో చేతులు కలిపిన ఆసీస్ మాజీ కోచ్
యాషెస్ సిరీస్‌కు సిద్ధంగా ఉన్నా: ఫ్లింటాఫ్
క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మైకెల్ వాన్
40వ ఏట అడుగుపెట్టిన జయసూర్య
మిగిలిన సిరీస్‌కు విండీస్ జట్టు యథాతథం