ఆస్ట్రేలియా వివాదాస్పద ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్ ప్రస్తుత పరిస్థితికి తాను కారణం కాదని టీం ఇండియా ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తెలిపాడు. భజ్జీతో వివాదం కారణంగానే సైమండ్స్ తాగుడుకు బానిస అయ్యాడని సైమో స్నేహితురాలు కేథీ ఆరోపించిన సంగతి తెలిసిందే.
ఈ ఆరోపణలపై భజ్జీ స్పందిస్తూ.. ఆండ్రూ సైమండ్స్ తాగుడుకు తాను కారణం కాదని కొట్టిపారేశాడు. ఇంకా సైమోను ఎవరూ బలవంతంగా తాగించడం లేదని భజ్జీ అన్నాడు.
నిజానికి నిందించాల్సింది తనను కాదని, ఎవరూ సైమండ్స్‌కు బలవంతంగా తాగించట్లేదని హర్భజన్ తెలిపాడు. తనతో సిడ్నీలో జరిగిన వివాదం తర్వాతే సైమండ్స్ తాగుడుకు బానిస అయ్యాడని కేథీ ఆరోపణలను భజ్జీ తోసిపుచ్చాడు. |