ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్ డామియన్ మార్టీన్ 2005లో తమ జట్టు యాషెస్ సిరీస్ కోల్పోవడానికి అప్పటి కోచ్ జాన్ బుకానన్ కూడా కారణమని ఆరోపించారు. ఆస్ట్రేలియా మాజీ కోచ్ జాన్ బుకానన్ 2005 యాషెస్‌లో జట్టు వైఫల్యానికి కారణమని మార్టిన్ పేర్కొన్నాడు. అంతేకాకుండా జట్టు యాజమాన్యం కూడా ఆ సమయంలో తప్పు చేసిందన్నాడు.
యాషెస్ సిరీస్‌ను కూడా జట్టు యాజమాన్యం మరో సాధారణ సిరీస్‌గా పరిగణించిందని, దీనికి సరిగా ప్రణాళికలు సిద్ధం చేయలేదని మార్టిన్ వెల్లడించాడు. 2005 యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా కోల్పోవడానికి సంబంధించి స్పిన్ దిగ్గజం షేన్ వార్న్, మాక్‌గిల్ చేసిన వ్యాఖ్యలు సరైనవేనని మార్టిన్ అభిప్రాయపడ్డాడు. జట్టు యాజమాన్యం యాషెస్‌కు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేదు.
ఆస్ట్రేలియా జట్టు ఈ సిరీస్‌కు సరిగా సన్నద్ధం కాలేదు. అంతా హడావుడిగా జరిగిపోయింది. షేన్ వార్న్, మాక్‌గిల్‌లు 2005 యాషెస్ పరాజయానికి బుకానన్ కూడా కారణమని ఆరోపించారు. ఆస్ట్రేలియా ఆ ఏడాది 18 ఏళ్ల తరువాత యాషెస్ సిరీస్‌ను ప్రత్యర్థి ఇంగ్లాండ్‌కు కోల్పోయింది. తాజాగా ఈ సిరీస్‌లో తాము నిశ్చేష్టులమవగా, ప్రత్యర్థులకు అన్నీ కలిసొచ్చాయని మార్టిన్ పేర్కొన్నాడు. |