ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > వార్తలు > రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఐసీఎల్ ఆటగాడు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఐసీఎల్ ఆటగాడు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అడుగుపెట్టిన తొలి ఐసీఎల్ ఆటగాడిగా అభిషేక్ జుంజువాలా గుర్తింపు పొందాడు. వివాదాస్పద ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్)లో ఆడిన అభిషేక్ ఇప్పుడు ఈ టోర్నీతో తెగతెంపులు చేసుకున్నాడు. అతడితో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోని రాజస్థాన్ రాయల్స్ జట్టు ఒప్పందం కుదుర్చుకుంది.

దీంతో ఐపీఎల్‌లో అడుగుపెట్టిన తొలి ఐసీఎల్ ఆటగాడిగా అభిషేక్ గుర్తింపు పొందాడు. బెంగాల్‌కు చెందిన ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ మూడో సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడనున్నాడు. ఇంగ్లాండ్ ట్వంటీ- 20 ఛాంపియన్స్ మిడిల్‌‍సెక్స్ పాంథర్స్‌తో లార్డ్స్‌లో జరిగే ట్వంటీ- 20 మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది.

ఈ మ్యాచ్ కోసం జరిగిన సన్నాహాక శిబిరంలో అభిషేక్ పాల్గొన్నాడు. ఈ మ్యాచ్‌లో ఇతనికి చోటు లభించే అవకాశాలు లేకపోలేదు. ఇదిలా ఉంటే మరో ఐసీఎల్ ఆటగాడు ఫయాజ్ ఫజల్‌లు కూడా ఇంగ్లాండ్ జట్టు తరపున ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది. బెంగాల్, ఈస్ట్ జోన్ జట్ల తరపున 15 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ 37.9 సగటుతో 872 పరుగులు చేశాడు.

అనంతరం ఐసీఎల్‌లో రాయల్ బెంగాల్ టైగర్స్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఐసీఎల్‌లో అభిషేక్ మూడు అర్ధ సెంచరీలతో 615 పరుగులు చేశాడు. మిడిలార్డర్‌లో నమ్ముకోదగిన బ్యాట్స్‌మన్‌గానే కాకుండా ఫీల్డింగ్‌లోనూ అభిషేక్ ఆకట్టుకున్నాడు. అతని ఖాతాలో 12 క్యాచ్‌లు, 6 రనౌట్‌లు ఉన్నాయి.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
యాషెస్ పరాజయానికి బుకాననే కారణం
సైమో పరిస్థితికి నేను కారణం కాదు: భజ్జీ
రామ్‌పాల్ అద్భుతమైన బౌలర్: ధోనీ ప్రశంస
భారత్‌లో ఆసీస్ పర్యటన: వేదికల ఖరారు
పశ్చిమ ఆస్ట్రేలియాకు ఆడనున్న క్రిస్ గేల్
అప్పటికీ, ఇప్పటికీ మార్పులేని పాంటింగ్