వివాదాస్పద ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ ఆండ్ర్యూ ఫ్లింటాఫ్ తన ప్రాభవాన్ని కోల్పోయాడని మాజీ కెప్టెన్ మైక్ గాటింగ్ అభిప్రాయపడ్డారు. ఇంగ్లాండ్ జట్టు ఫ్లింటాఫ్ లేకుండా ఆడటం అలవాటు చేసుకోవాలని సూచించాడు. ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ ఫ్లింటాఫ్ లేకుండా కూడా యాషెస్ సిరీస్ విజయం సాధించగలదని పేర్కొన్నాడు.
ఫ్లింటాఫ్ ఇప్పుడు ఆల్‌రౌండర్‌లాగా కాకుండా, బౌలర్‌గానే ఎక్కువ ఆడుతున్నాడని, అతడిని జట్టు నుంచి తొలగించవచ్చని గాటింగ్ అభిప్రాయపడ్డాడు. ఫ్లింటాఫ్‌ను మీరు వదిలిపెట్టాలనుకోవడం లేదు. ఎందుకంటే అతను ఎంతో సేవ చేశాడు. అయితే ఫ్లింటాఫ్ లేకుండా కూడా ఇంగ్లాండ్ ఆడటం నేర్చుకోవాలని గాటింగ్ పేర్కొన్నట్లు టైమ్స్ వెల్లడించింది.
ఫ్లింటాఫ్ లేకుండా వెస్టిండీస్‌పై టెస్ట్ సిరీస్ విజయం సాధించగలిగామని ఈ మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ గుర్తు చేశాడు. ఇప్పుడు ఫ్లింటాఫ్ నుంచి ఎక్కువ పరుగులు ఆశించలేము. అయితే అతను వికెట్లు సాధించగలడు. మీకోసం బౌలింగ్ మాత్రమే చేసిపెట్టగలడు. బౌలర్‌గా అయితే అతని స్థానంలో ఇంకొకరిని తీసుకోవచ్చని, మీకు ఆ సామర్థ్యం ఉందని గాటింగ్ వ్యాఖ్యానించాడు. |