2005లో జరిగిన యాషెస్ సిరీస్‌లో ప్రాక్టీస్ లేకుండా ఆడాల్సి వచ్చిందని ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్ డామియన్ మార్టిన్ అన్నాడు. ఇంగ్లాండ్ జట్టు సలహాదారుగా మారి జాన్ బుకానన్ ఆస్ట్రేలియా రహస్యాలన్నీ చెప్పేస్తున్నాడనే అక్కసుతోనే ఆసీస్ ఆటగాళ్లు బుకానన్‌పై ఆరోపణలు చేస్తున్నారని వార్తలొచ్చాయి.
ఈ నేపథ్యంలో బుకానన్ వల్లే తాము 2005 యాషెస్ సిరీస్‌ను కోల్పోవాల్సి వచ్చిందని మార్టిన్ అన్నాడు. ఆ సిరీస్‌లో తమ జట్టుకు ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయని అతడు చెప్పాడు.
యాషెస్ ఓటమిపై వార్న్, మెక్‌గిల్ చేసిన వ్యాఖ్యలు సరైనవేనని మార్టిన్ తెలిపాడు. మేనేజ్‌మెంట్ తప్పిదం వల్ల 2005 యాషెస్‌లో ఓటమిని చవిచూశామని, దీనికి బుకానన్ కూడా కారణమని అతడు వెల్లడించాడు. |