పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) గురువారం ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ అసిఫ్‌కున్న కష్టాలన్నింటినీ తొలగించింది. ఈ ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు అతనికి మార్గం సుగమం చేసింది. జాతీయ జట్టులో ఆడేందుకు ఇప్పటివరకు అసిఫ్‌కు నిషేధం అడ్డుగా ఉన్న సంగతి తెలిసిందే. గత ఏడాది దుబాయ్ విమానాశ్రయంలో డ్రగ్ కేసులో అసిఫ్ చిక్కుకున్నాడు.
తదనంతర పరిణామాలు అసిఫ్‌పై నిషేధానికి దారితీశాయి. ఈ డ్రగ్ కేసుపై సుదీర్ఘ విచారణ జరిగింది. తనకు తెలిసి, కావాలని డ్రగ్స్ తన వద్ద ఉంచుకోలేదని అసిఫ్ ఈ కేసు విచారణలో వివరణ ఇచ్చాడు. ఏదైతేనం ఇప్పుడు అసిఫ్‌ను జరిమానాతో వదిలిపెట్టాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. అతనిపై 10 లక్షల రుపాయాల జరిమానా విధించి, నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు వెల్లడించింది. |