రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఆడేందుకు ఆల్‌రౌండర్ సోహైల్ తన్వీర్‌ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అనుమతించింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ నెల 6న లండన్‌లోని లార్డ్స్ మైదానంలో జరిగే ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఇంగ్లీష్ ఛాంపియన్ మిడిల్‌సెక్స్ జట్టుతో తలపడనున్న సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఆడేందుకు తన్వీర్‌కు పీసీబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. బ్రిటీష్ ఏషియన్ ట్రస్ట్ కోసం జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తన్వీర్ ఆడతాడని రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓ ప్రకటనలో తెలిపింది. సోహైల్ తన్వీర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తొలి సీజన్‌లో అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు.
అంతేకాకుండా ఐపీఎల్ తొలి సీజన్ టైటిల్‌ను రాజస్థాన్ రాయల్స్ జట్టు కైవసం చేసుకోవడంలో తన్వీర్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్- భారత్ మధ్య క్రికెట్ సంబంధాలు దెబ్బతినడంతో తన్వీర్ దక్షిణాఫ్రికాలో జరిగిన ఐపీఎల్ రెండో సీజన్‌కు దూరమయ్యాడు. |