ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > వార్తలు > యాషెస్‌కు లీనే మెరుగైన ప్రత్యామ్నాయం: గిల్లీ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
యాషెస్‌కు లీనే మెరుగైన ప్రత్యామ్నాయం: గిల్లీ
ప్రస్తుత యాషెస్ సిరీస్‌కు ఆస్ట్రేలియా ఫాస్ట్‌బౌలర్ బ్రెట్‌లీ మెరుగైన ప్రత్యామ్నాయమని ఈ దేశ మాజీ వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్‌లో నాలుగేళ్ల క్రితం ఆస్ట్రేలియా 1-2 యాషెస్ విజయం సాధించడంలో బ్రెట్‌లీ కీలకపాత్ర పోషించాడని గిల్లీ గుర్తు చేశాడు. చీలమండ గాయం నుంచి కోలుకున్న బ్రెట్‌లీ పేలవమైన ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు.

అయితే బ్రెట్‌లీకి ఇంగ్లాండ్‌లో ఘనమైన రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన 10 టెస్ట్ మ్యాచ్‌లలో బ్రెట్‌లీ 29 వికెట్లు పడగొట్టాడు. అయితే ప్రస్తుత ఫామ్ అతనికి శాపంగా మారింది. దీంతో ఈసారి యాషెస్ సిరీస్‌లో భాగంగా కార్డిఫ్‌లో ఈ నెల 8న కార్డిఫ్‌లో ప్రారంభమయ్యే తొలి టెస్ట్ మ్యాచ్‌లో మిచెల్ జాన్సన్, పీటర్ సిడిల్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

జట్టులో మరో పేస్ బౌలింగ్ స్థానం కోసం బ్రెట్‌లీ, స్టువర్ట్ క్లార్క్ పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో గిల్లీ మాట్లాడుతూ.. వీరిలో ఎవరితో వెళతారనే తాను ఊహించలేనని చెప్పాడు. బ్రెట్‌లీని జట్టులోకి తీసుకుంటే అతను తన బాధ్యతలకు న్యాయం చేస్తాడని గిల్లీ నమ్మకం వ్యక్తం చేశాడు. ఇప్పుడు బ్రెట్‌లీకి మరో నాలుగేళ్లు అనుభవం ఉంది. అంతేకాకుండా అతని ఖాతాలో 300 టెస్ట్ వికెట్లు ఉన్నాయి.

అతని అనుభవం జట్టుకు తప్పకుండా ఉపయోగపడుతుందని గిల్లీ అభిప్రాయపడ్డాడు. బ్రెట్‌లీ ఇంగ్లాండ్ టూర్‌ను ఇష్టపడతాడు. అంతేకాకుండా అతను ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడు. వికెట్ల దాహంతోనూ ఉన్నట్లు కనిపిస్తున్నాడు. స్టువర్ట్ క్లార్క్‌కు కూడా అద్భుతంగా ఆడుతున్నాడని గిల్లీ పేర్కొన్నాడు. ఇంగ్లాండ్‌తో తొలి టెస్ట్ మ్యాచ్‌కు ఆస్ట్రేలియా స్పిన్నర్‌తో బరిలో దిగాలని ఈ సందర్భంగా సూచించాడు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
పాకిస్థాన్‌తో తొలి టెస్ట్‌కు మురళీధరన్ దూరం
తన్వీర్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు గ్రీన్‌సిగ్నల్
డ్రగ్ కేసు: మొహమ్మద్ అసిఫ్‌పై నిషేధం ఎత్తివేత
బుకానన్ వల్లే యాషెస్‌లో ఓడాం: మార్టిన్
ప్రస్తుత వన్డే సిరీస్ అర్థరహితం: మంజ్రేకర్
ఐసీసీ ర్యాంకింగ్స్: టాప్-10లో గంభీర్, భజ్జీ