సెయింట్ లూసియాలో వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేకు వర్షం అడ్డంకిగా మారింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ ఈ మ్యాచ్‌లో రెండు మార్పులతో బరిలోకి దిగింది.
ఇదివరకటి మ్యాచ్‌లో ఆడిన ప్రవీణ్ కుమార్, రవీంద్ర జడేజాలకు విశ్రాంతినిచ్చి ఇషాంత్ శర్మ, అభిషేక్ నాయర్‌లను జట్టులోకి ఎంపిక చేసారు.
ఇక వెస్టిండీస్ జట్టులో మార్పులేమి లేకుండానే బరిలోకి దిగింది. వానకారణంగా మ్యాచ్‌కు మరింత అడ్డంకిగా మారే అవకాశాలున్నాయని క్రీడాభిమానులు నిరాశచెందుతున్నట్లు సమాచారం. |