ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > వార్తలు > మూడో వన్డేలో భారత్ గెలుపు: 2-1తో ఆధిక్యం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మూడో వన్డేలో భారత్ గెలుపు: 2-1తో ఆధిక్యం
FileFILE
ఎట్టకేలకు వరుణుడు అడ్డుపడినా.. తిరిగి కరుణించడం.. కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ బాధ్యతాయుత ఇన్నింగ్స్ భారత్‌కు మూడో వన్డేలో విజయాన్ని సాధించిపెట్టాయి. దీంతో ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్‌లో విండీస్‌పై భారత్ 2-1తో ఆధిక్యంలోకి వచ్చింది.

తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ధోనీ నిర్ణయం సరైనదిగా భారత బౌలర్లు సమిష్ఠిగా రాణించి చూపించారు. మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుండి వరుసగా నాలుగు సార్లు వర్షం రావడంతో మూడో వన్డేకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మ్యాచ్ రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో ఈ మ్యాచ్‌ను 27 ఓవర్లకు కుదించారు.



విండీస్ ఓపెనర్లు గేల్, మోర్టాన్‌లు ఓ మోస్తరుగా రాణించారు. అయితే శర్వాణ్ మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. ప్రమాదకర గేల్‌ను (27) నెహ్రా త్వరగానే పెవిలియన్‌కు చేర్చినా.. మోర్టాన్, శర్వాణ్‌లు నిలబడిపోతున్నట్లు కనిపించారు. కానీ హర్భజన్ వేసిన ఓ చక్కటి బంతికి మోర్టాన్ (22) వికెట్ సమర్పించుకున్నాడు.

ఆ తర్వాత మధ్యలో మళ్లీ వర్షం. మళ్లీ ఆట ప్రారంభమైన తర్వాత చందర్‌పాల్‌తో కలిసి శర్వామ్ స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. ఇందులో భాగంగా ఓ సిక్స్ కూడా సంధించాడు. అయితే ఈ లోగా వికెట్ల మధ్య పరిగెడుతూ రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ ఓ మోస్తరుగా రాణించారు.

దీంతో నిర్ణీత 27 ఓవర్ల ముగిసే సమయానికి విండీస్ 186 పరుగులు చేయగలిగింది. ఆ తర్వాత వర్షం అంతరాయం కారణంగా డక్‌వర్త్ లూయీస్ ప్రకారం మ్యాచ్‌ను 22 ఓవర్లకు కుదించి 158 పరుగుల లక్ష్యాన్ని అంపైర్లు నిర్ణయించారు.

అయితే భారత్ దీనికి తగ్గట్టుగానే స్పందించింది. ఓపెనర్లు కార్తీక్, గంభీర్‌లు చక్కగా రాణించారు. వీరి రాణింపుతో భారత్ 80 పరుగుల వరకు ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. అయితే ఆ తర్వాత కార్తీక్ (47) రనౌట్‌గా వెనుదిరిగినా గంభీర్ అండతో ధోనీ క్రీజులో నిలదొక్కుకున్నాడు. నిదానంగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు.

ఇంతలో బెన్ వేసిన బంతిని అంచనా వేయడంలో గంభీర్ తప్పిదం చేశాడు. దీంతో గాలిలోకి లేచిన బంతిని కీపర్ రామ్‌దిన్ ఒడిసి పట్టుకున్నాడు. ఈ సమయంలో భారత్‌ కష్టాల్లో పడినట్లు కనిపించింది. యువరాజ్ (2) సింగ్ అలా వచ్చి అలా వెళ్లిపోయాడు. రెండు కీలక వికెట్ల నేలకూలినా ధృడవిశ్వాసంతో ధోనీ తన పని తాను చేసుకుపోయాడు.

శర్మా (11), పఠాన్ (8)తో కలిసి చివరి ఓవర్ వరకు ఉండి మరో బంతి మిగిలి ఉండగానే ధోనీ.. భారత్‌ను విజయపథంలో నడిపించాడు. విజయానికి కీలకమైన పరుగులు చేయడమే కాకుండా భారత్‌ను సమిష్టిగా ముందుకు నడిపించిన ధోనీకి మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు లభించింది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
మూడో వన్డేకు వర్షం అడ్డంకి
వన్డే సిరీస్: నేడు కీలకమైన మూడో మ్యాచ్
యాషెస్‌కు లీనే మెరుగైన ప్రత్యామ్నాయం: గిల్లీ
పాకిస్థాన్‌తో తొలి టెస్ట్‌కు మురళీధరన్ దూరం
తన్వీర్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు గ్రీన్‌సిగ్నల్
డ్రగ్ కేసు: మొహమ్మద్ అసిఫ్‌పై నిషేధం ఎత్తివేత