స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరగాల్సిన క్రికెట్ సిరీస్‌ను తటస్థ వేదికలపై నిర్వహించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆలోచన చేస్తోంది. ప్రపంచ ట్వంటీ-20 కప్ విజేతగా నిలిచినప్పటికీ, పాక్‌లో పర్యటించేందుకు విదేశీ క్రికెట్ జట్లు సాహసం చేయడం లేదు. ఫలితంగా స్వదేశంలో జరగాల్సిన క్రికెట్ సిరీస్‌లను తటస్థ వేదికలపై నిర్వహించి, కొంతలో కొంత నష్టాన్నైనా పూడ్చుకోవాలని పీసీబీ భావిస్తోంది.
ఈ యేడాది ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ను అబుదాబీ, దుబాయ్‌లలో పీసీబీ నిర్వహించింది. అలాగే, కివీస్‌తో జరగాల్సిన క్రికెట్ మ్యాచ్‌లను కూడా ఈ రెండు వేదికలపైనే నిర్వహించాలని భావిస్తోంది.
భద్రతా కారణాల పాక్‌లో జరగాల్సిన మూడు టెస్టులు, ఐదు వన్డేల సిరీస్‌ను తటస్థ వేదికలపై నిర్వహించనున్నట్టు పీసీబీ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ సిరీస్‌లను న్యూజిలాండ్‌లోనే నిర్వహించేందుకు పీసీబీ కృషి చేస్తోంది. ఇందుకోసం కివీస్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరుపుతోంది.
అయితే, ఈ అంశంపై ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ఇంకా ఓ అభిప్రాయానికి రాలేదు. ఇదివీలుపడని పక్షంలో సిరీస్‌ను అబుదాబీ, దుబాయ్‌లలో నిర్వహించేందుకు ఏర్పాటు చేయవచ్చని పీసీబీ వర్గాలు భావిస్తున్నాయి. |