ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > వార్తలు > టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
శ్రీలంకతో శనివారం నుంచి ఆరంభమైన తొలి టెస్టులో పాకిస్థాన్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా, ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు తరపున 17 సంవత్సరాల లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్‌ అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేశాడు.

పాకిస్థాన్ జట్టు ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న విషయం తెల్సిందే. ఈ పర్యటనలో భాగంగా తొలి టెస్టు శనివారం గాలే స్టేడియంలో ప్రారంభమైంది. ఐసీఎల్‌ నుంచి తప్పుకున్న పాక్ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ యూసఫ్‌కు ఈ టెస్టులో ఆడే అవకాశం కల్పించారు.

ఇకపోతే, మోకాలి గాయం నుంచి కోలుకోని శ్రీలంక స్నిన్నర్ ముత్తయ్య మురళీధరన్ తొలి టెస్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో మరో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రంగణా హేరత్‌కు చోటు కల్పించారు. అలాగే, శ్రీలంక ఆల్‌రౌండర్ అంగెలో మ్యాథ్యూస్‌కు తొలి టెస్టు ఆడే అవకాశం దక్కింది.

ఇరు జట్ల వివరాలు..
పాకిస్థాన్... యూనిస్ ఖాన్ (కెప్టెన్), సల్మాన్ భట్, ఖుర్రుమ్ మంజూరు, మహమ్మద్ యూసఫ్, మిస్బావుల్ హక్, షోయబ్ మాలిక్, కమ్రాన్ అక్మాల్, ఉమర్ గుల్, సయీద్ అజ్మల్, మహ్మద్ అమీర్, అబ్దుర్ రౌఫ్.

శ్రీలంక జట్టు.. కుమార సంగక్కర (కెప్టెన్), వర్ణపురా, పరణవితనా, మహేళ జయవర్ధనే, థిలాన్ సమారవీర, దిల్షాన్, మ్యాథ్యూస్, మెండిస్, తుషారా, కులశేఖకర, రంగణా హెరత్.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
తటస్థ వేదికపై కివీస్‌తో పాక్ హోమ్ సిరీస్
మూడో వన్డేలో భారత్ గెలుపు: 2-1తో ఆధిక్యం
మూడో వన్డేకు వర్షం అడ్డంకి
వన్డే సిరీస్: నేడు కీలకమైన మూడో మ్యాచ్
యాషెస్‌కు లీనే మెరుగైన ప్రత్యామ్నాయం: గిల్లీ
పాకిస్థాన్‌తో తొలి టెస్ట్‌కు మురళీధరన్ దూరం