శ్రీలంక జట్టు సీనియర్ క్రికెటర్ చమిందా వాస్ టెస్టు కెరీర్‌కు స్వస్తి చెప్పనున్నాడు. ఈ విషయాన్ని ఆ దేశ క్రికెట్ బోర్డు చీఫ్ సెలక్టర్ అశాంతా డీ మెల్ శనివారం వెల్లడించారు. 35 సంవత్సరాల వాస్.. శ్రీలంక క్రికెట్ జట్టు కోసం 15 సంవత్సరాల పాటు సేవలు అందించాడు.
ఈ నేపథ్యంలో, టెస్టులకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు. అయితే, వన్డేలు, ట్వంటీ-20 మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడని చీఫ్ సెలక్టర్ తెలిపారు.
ఈ విషయాన్ని చమిందా వాస్ తనకు చెప్పారన్నారు. 110 టెస్టులు ఆడిన చమిందా వాస్‌ను ప్రస్తుతం పాక్‌తో స్వదేశంలోజరుగుతున్న టెస్టు సిరీస్‌కు పరిగణంలోకి తీసుకోలేదు. దీంతో అతను తీవ్ర నిరాశకు లోనయ్యాడు.
1994లో కేండీలో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేసిన చమిందా వాస్.. 29.4 సగటుతో 354 వికెట్లు తీశాడు. తన కెరీర్‌లో 12 సార్లు ఐదు వికెట్లు, రెండు సార్లు పది వికెట్లు చొప్పున తీశాడు.
అలాగే, 322 వన్డే మ్యాచ్‌లు ఆడిన వాస్.. 400 వికెట్లు పడగొట్టాడు. వీటిలో ఒక హ్యాట్రిక్ కూడా ఉంది. దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన 2003 ప్రపంచ కప్ టోర్నీలో బంగ్లాదేశ్‌పై ఈ హ్యాట్రిక్‌ను నమోదు చేసుకున్నాడు. |