ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > వార్తలు > తొలి టెస్టు: శ్రీలంకను కట్టడి చేసిన పాక్ బౌలర్లు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
తొలి టెస్టు: శ్రీలంకను కట్టడి చేసిన పాక్ బౌలర్లు
సొంత గడ్డపై పాకిస్థాన్‌తో ఆరంభమైన తొలి టెస్టులో శ్రీలంక జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 292 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన పాకిస్థాన్ జట్టు ఏడు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 15 పరుగులు చేసింది. శ్రీలంక చేసిన పరుగులకు మరో 277 పరుగులు వెనుకబడి ఉండగా, చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్నాయి.

అంతకుముందు టాస్ నెగ్గిన పాక్ కెప్టెన్ యూనిస్ ఖాన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. శ్రీలంక జట్టు స్కోరు 3 పరుగుల మీద ఉండగా, మహ్మద్ అమీర్ లంక ఓపెనర్ వర్ణపురా (2)ను అవుట్ చేశాడు. మరో ఓపెనర్ వర్ణవితన మాత్రం 72 పరుగులతో రాణించాడు. కెప్టెన్ సంగక్కర (9) మాత్రం తక్కువ స్కోరుకే ఔటైనప్పటికీ.. మిగిలిన బ్యాట్స్‌మెన్స్ రెండంకెల స్కోరు చేశారు.

దీంతో శ్రీలంక జట్టు 81 ఓవర్లలో 292 పరుగులకు ఆలౌట్ అయింది. పాక్ బౌలర్లలో మహ్మద్ అమీర్ 3, అబ్దుర్ రౌఫ్, యూనిస్ ఖాన్, సయీద్ అజ్మల్‌లు రెండేసి వికెట్లు తీశారు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేపట్టిన పాక్ జట్టుకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ సల్మాన్ భట్ డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ మంజూర్ కూడా రెండు పరుగులకే పెవిలియన్‌కు చేరడంతో పాక్ జట్టు 5 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
టెస్టులకు గుడ్‌బై చెప్పనున్న చమిందా వాస్!
ట్వంటీ-20 ప్రపంచ కప్ వారం వాయిదా: ఐసీసీ
బౌలర్ సోహైల్ తన్వీర్‌కు పీసీబీ అనుమతి
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
తటస్థ వేదికపై కివీస్‌తో పాక్ హోమ్ సిరీస్
మూడో వన్డేలో భారత్ గెలుపు: 2-1తో ఆధిక్యం