టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అవుతున్నట్టు చీఫ్ సెలక్టర్ ప్రకటించిన వార్తలను శ్రీలంక క్రికెటర్ చమిందా వాస్ తోసిపుచ్చాడు. ప్రస్తుతానికి తన రిటైర్మెంట్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వాస్ చెప్పుకొచ్చాడు.
శ్రీలంక క్రికెట్ బోర్డు కార్యదర్శి నిషాంతా రణతుంగ మాట్లాడుతూ, వాస్ పరిమిత ఓవర్ల క్రికెట్‌పై ఎక్కువ దృష్టి సారించాలని సూచించాడు. ఇదే విషయాన్ని చీఫ్ సెలక్టర్ వద్ద చమిందా చెప్పాడని తెలిపాడు. అయితే, ఈ వార్తలను వాస్ ఖండిస్తున్నాడు.
110 టెస్టులు ఆడిన వాస్ గత 15 సంవత్సరాలుగా దేశ క్రికెట్‌కు సేవలు అందిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ కావాలని భావిస్తున్నట్టు చీఫ్ సెలక్టర్‌కు చెప్పాడని రణతుంగా చెప్పాడు. ఏది ఏమైనా వాస్ రిటైర్మెంట్‌పై లంక క్రికెట్‌లో పెద్ద వివాదమే చెలరేగింది. |