ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > వార్తలు > టీ-20 ప్రపంచ-2010 కప్: సీ గ్రూపులో భారత్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
టీ-20 ప్రపంచ-2010 కప్: సీ గ్రూపులో భారత్
ఇటీవల ఇంగ్లండ్ గడ్డపై జరిగిన ఐసీసీ ట్వంటీ-20 ప్రపంచ కప్‌లో పూర్తిగా నిరాశపరిచిన భారత్.. 2010లో జరుగనున్న ట్వంటీ-20 ప్రపంచ కప్‌లో "సి" గ్రూపులోకి మారింది. వచ్చే యేడాది కరేబియన్ దీవులు ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీలో భారత్, దక్షిణాఫ్రికా జట్లతో పాటు.. మరో క్వాలిఫైయర్ జట్టు ఉంటుంది.

ఈ క్వాలిఫైయర్ జట్టుతోనే 'టీమ్ ఇండియా' తన తొలి మ్యాచ్‌లో తలపడుతుంది. టీ-20 ప్రపంచకప్‌-2010 షెడ్యూలును అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించింది. అందులో ఛాంపియన్‌ పాకిస్థాన్‌ గ్రూపు "ఏ"లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌లతో తేల్చుకుంటుంది.

రన్నరప్‌ శ్రీలంక గ్రూపు "బి"లో న్యూజిలాండ్‌, జింబాబ్వేలతో తలపడుతుంది. ఇక గ్రూపు "డి"లో వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌, రెండో క్వాలిఫైయింగ్‌ జట్టుతో తలపడతాయి. కాగా, ఈ టోర్నీ ఏప్రిల్‌ 30వ తేదీ నుంచి ప్రారంభమై మే 16వ తేదీతో ముగుస్తుంది. రెండు సెమీఫైనల్‌ మ్యాచ్‌లు మే 13, 14 తేదీల్లో, ఫైనల్‌ మ్యాచ్‌ మే 16వ తేదీన జరుగుతుంది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
సెంచరీతో ఆకట్టుకున్న యూసఫ్: పాక్ ఆలౌట్
చివరి వన్డేకు వర్షం అడ్డంకి: సిరీస్ భారత్ వశం
ఉపాధ్యక్షులను నియమించిన ఏసీఏ
ఇంగ్లండ్ జట్టులో ఓనియన్స్, బెల్‌లకు చోటు
2010 ఐసీసీ టీ-20 ప్రపంచ కప్ వేదిక ఖరారు
నేడే భారత్-వెస్టిండీస్‌ల మధ్య ఆఖరి వన్డే