కరేబియన్ దీవుల పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ జట్టు ఆడుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 238 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటిగ్ చేపట్టిన వెస్టిండీస్ జట్టు రెండో రోజు ఆటముగిసే సమయానికి వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది. వెస్టిండీస్ జట్టు స్కోరు 15 పరుగుల వద్ద ఉండగా, ఓపెనర్ రిచర్డ్స్ (13) అల్ హాసన్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.
అంతకుముందు టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు తొలుత బ్యాటింగ్ చేపట్టింది. ఆ జట్టు ఓపెనర్లు 45 పరుగులు జోడించి శుభరంభం ఇచ్చినప్పటికీ, మిగిలిన బ్యాట్స్‌మెన్స్ పెద్దగా రాణించలేక పోయాడు.
ఇమ్రాన్ (33), సిద్ధిక్యూ (27), రహీమ్ (36), హాస్సైన్ (33)లు రాణించడంతో ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. విండీస్ బౌలర్లలో రోచ్ మూడు వికెట్లు తీయగా, బెస్ట్, బెర్నాడ్‌లు రెండేసి, సమ్మీ, ఆస్టిన్‌లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. |