ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > వార్తలు > ఫ్లింటాఫ్ ఇప్పుడు సెకండ్ హాండ్ కారు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఫ్లింటాఫ్ ఇప్పుడు సెకండ్ హాండ్ కారు
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ ఆండ్ర్యూ ఫ్లింటాఫ్ ఇప్పుడు సెకండ్ హాండ్ కారు లాంటివాడని మాజీ కెప్టెన్ మైక్ అథెర్టన్ విమర్శించారు. సెకండ్ హాండ్ కారుతో ఎంత ఉపయోగం ఉంటుందో, ఫ్లింటాఫ్ వలన కూడా అంతే ఉపయోగం ఉంటుందని ఎద్దేవా చేశారు. ఫ్లింటాఫ్ ఫిట్‌నెస్‌పై ఇంగ్లాండ్ అనవసరంగా ఆందోళన చెందుతోందన్నారు.

నాలుగేళ్ల క్రితం ఇంగ్లండ్ యాషెస్ సిరీస్ విజయంలో ఫ్లింటాఫ్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఫ్లింటాఫ్ ఆల్‌రౌండ్ ప్రతిభ ఆ సమయంలో ఇంగ్లాండ్‌కు యాషెస్ సిరీస్‌ను అందించింది. అయితే అతని ఆట ఇప్పుడు ఆ స్థాయిలో లేదని అథెర్టన్ పేర్కొన్నారు. ఫ్లింటాఫ్ ఇప్పుడు విజయమంత్రం కాదని అభిప్రాయపడ్డారు.

కార్డిఫ్‌లో జరిగిన తొలి యాషెస్ టెస్ట్ సందర్భంగా ఫ్లింటాఫ్ మోకాలికి గాయమైంది. దీంతో రెండో టెస్ట్ మ్యాచ్‌కు అతను దూరమయ్యాడు. ఫ్లింటాఫ్ అందుబాటులో లేకపోవడంతో ఇంగ్లండ్‌కు అంతా ముగిసినట్లు కాదని అథెర్టన్ చెప్పారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
క్రీడా స్ఫూర్తిపై పాంటింగ్ మాట్లాడటమా?
విండీస్‌పై బంగ్లాదేశ్‌కు సంచలన విజయం
రెండో టెస్టు: ఇంగ్లండ్ జట్టులోకి హార్మిసన్
యాషెస్ మూడో టెస్ట్‌లో ఆడతా: బ్రెట్‌లీ
రేపు 2011 ప్రపంచకప్ లోగో ఆవిష్కరణ
పాక్ సెలెక్షన్ కమిటీ కొత్త ఛైర్మన్ ఖాసిం