త్వరలో టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్న స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్ర్యూ ఫ్లింటాఫ్ కోసమైనా ఇంగ్లండ్ జట్టు సభ్యులు ప్రస్తుత యాషెస్ సిరీస్‌ను గెలిచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తారని ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. ఫ్లింటాఫ్‌కు అతనికి ఘనమైన సెండాఫ్ ఇచ్చేందుకు అతని సహచరులు ఈ ప్రయత్నం చేస్తారని గిల్లీ పేర్కొన్నాడు.
ఆస్ట్రేలియాపై ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న యాషెస్ సిరీస్ గెలిచేందుకు ఇంగ్లండ్ జట్టు శాయశక్తులా ప్రయత్నిస్తుందన్నాడు. ఫ్లింటాఫ్ జట్టుకు తీరమవతాడనే వార్త ఇంగ్లండ్ జట్టుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తాను భావించడం లేదన్నాడు. ఫ్లింటాఫ్ రిటైర్మెంట్ వార్తా వారిలో కసిని పెంచే అవకాశం ముంది. ఫ్లింటాఫ్ టెస్ట్ కెరీర్‌కు ఘనమైన ముగింపు ఇచ్చేందుకు అతని సహచరులు యాషెస్ విజయాన్ని కానుకగా ఇచ్చే ప్రయత్నం చేస్తారని గిల్లీ చెప్పాడు.
గొప్ప ఆటగాళ్లు రిటైర్ అయ్యే సమయంలో జట్టులో పరిస్థితి ఎలా ఉంటుందనేది తనకు తెలుసు. అటువంటి సమయం జట్టు సభ్యులంతా సిరీస్ విజయం కోసం శాయశక్తులా ప్రయత్నిస్తారు. ఇప్పుడు ఇంగ్లండ్ కూడా యాషెస్‌పై కన్నేయడం సహజమేనని గిల్లీ అభిప్రాయపడ్డాడు. తాను ఆస్ట్రేలియా తరపున ఆడిన సమయంలో ఫ్లింటాఫ్ తనను తరచుగా ఇబ్బంది పెట్టేవాడు. అయితే ఇందుకు ఫ్లింటాఫ్‌పై తనకు ఎటువంటి అసంతృప్తి లేదని గిల్లీ వ్యాఖ్యానించాడు. |