కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్సీ మళ్లీ టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి దక్కింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌లో నైట్‌రైడర్స్ కెప్టెన్సీని గంగూలీకి బదులుగా మెక్‌కలమ్‌కు అప్పగించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. కోల్‌కతా క్రికెట్ అభిమానులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
అయితే ఇప్పుడు కోల్‌కతా అభిమానుల కోరిక ఫలించింది. వారనుకున్నట్లుగానే దాదాకే కేకేఆర్ కెప్టెన్సీ దక్కింది. ఇప్పటివరకు కేకేఆర్ కెప్టెన్‌గా ఉన్న బ్రెండన్ మెక్‌కలమ్ న్యూజిలాండ్ జాతీయ జట్టు బాధ్యతలవైపు మొగ్గు చూపడంతో ఐపీఎల్ కెప్టెన్సీ తిరిగి సౌరవ్ గంగూలీకి వచ్చింది. ఐపీఎల్ మూడో సీజన్‌లో గంగూలీ నేతృత్వంలోనే కేకేఆర్ బరిలో దిగనుంది. |