యాషెస్ సిరీస్‌లో మిగిలిన నిర్ణయాత్మక ఐదో టెస్ట్‌కు స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్ర్యూ ఫ్లింటాఫ్ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్లింటాఫ్‌కు ఇదే చివరి టెస్ట్ సిరీస్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్ అనంతరం టెస్ట్ క్రికెట్ నుంచి ఫ్లింటాఫ్ వైదొలగనున్నాడు. ఈ నేపథ్యంలో.. కెరీర్‌లో చివరి టెస్ట్ ఆడేందుకు ఫ్లింటాఫ్ ఉవ్విళ్లూరుతున్నాడు.
వచ్చే వారం ఒవల్‌లో ప్రారంభమవుతున్న ఐదో మ్యాచ్ యాషెస్ టెస్ట్ సిరీస్‌కు కీలకంగా మారిన సంగతి తెలిసిందే. రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్, నాలుగో టెస్ట్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించడంతో సిరీస్ 1-1తో సమమైంది. మిగిలిన రెండు టెస్ట్ మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
సిరీస్‌లో ఫలితం ఇప్పుడు ఐదో మ్యాచ్‌పై ఆధారపడివుంది. గాయాల కారణంగా నాలుగో టెస్ట్‌కు అందుబాటులో లేని ఆల్‌రౌండర్ ఆండ్ర్యూ ఫ్లింటాఫ్, పేస్‌బౌలర్ అండర్సన్‌లు ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నారని ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు వెబ్‌సైట్ వెల్లడించింది. తుది టెస్ట్‌కు పూర్తి ఫిట్‌నెస్‌తో అందుబాటులో ఉండేందుకే ఫ్లింటాఫ్‌కు నాలుగో టెస్ట్‌లో విశ్రాంతి కల్పించినట్లు ఈసీబీ వర్గాలు పేర్కొన్నాయి.