ప్రపంచ క్రికెట్ నుంచి వన్డే ఫార్మాట్‌ను తొలగించాలని ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ పునరుద్ఘాటించాడు. ట్వంటీ- 20 క్రికెట్ వన్డే ఫార్మాట్ అవసరం లేకుండా చేసిందని వార్న్ అభిప్రాయపడ్డాడు. క్రికెట్‌లో ఇప్పుడు టెస్ట్‌లు, ట్వంటీ- 20 రెండు ఫార్మాట్‌లు సరిపోతాయని పేర్కొన్నాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ నుంచి వన్డే ఫార్మాట్‌ను తొలగించవచ్చన్నాడు.
రెండు ఫార్మాట్‌లతో క్రికెట్ మెరుగ్గా విస్తరించగలదని షేన్ వార్న్ అభిప్రాయపడ్డాడు. క్రికెట్‌కు రెండు ఫార్మాట్‌లు మాత్రమే అవసరమవతాయి. షెడ్యూల్ విషయంలో ఏదో ఒకటి చేయాల్సి ఉందని హెరాల్డ్‌సన్‌కు రాసిన కాలమ్‌లో వార్న్ పేర్కొన్నాడు. ప్రపంచ క్రికెట్ నుంచి వన్డేలను తొలగించాలనే వాదనను గతంలో తెరపైకి తెచ్చిన వార్న్ తాజా కాలమ్‌లో ఈ వాదనను గట్టిగా సమర్థించుకున్నాడు.