వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » రెండో టెస్టు: సమరవీర సెంచరీ, లంక 416 ఆలౌట్ (Colombo | Test | Lanka | Kiwis | Innings |)
 
కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో పర్యాటక న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్ సమర వీర ఆదుకోవడంతో ఆ జట్టు భారీ స్కోరు చేయగలిగింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన కివీస్ జట్టు ఐదు వికెట్లు నష్టానికి 159 పరుగులు చేసింది. రాస్‌ టేలర్‌ అజేయంగా 70 పరుగులు చేసి కివీస్‌ ఇన్నింగ్స్‌లో ప్రధాన పాత్ర పోషించాడు.


తొలి రోజు మూడు వికెట్లకు 262 పరుగులతో ఉన్న లంక గురువారం తిరిగి బ్యాటింగ్‌కు దిగి మరో 149 పరుగులు జత చేసి ఆలౌట్‌ అయింది. సమర వీర, కాపుగెడెర కలిసి 72 పరుగులు జత కలిపి మంచి భాగస్వామ్యం అందించడంతో నాలుగువందల మార్క్‌ను అధిగమించగలిగింది.

అయితే సమర వీర మాత్రం నింపాదిగా ఆడుతూ 143 పరుగులు చేశాడు. తన కెరీర్‌లో నాలుగో సెంచరీ కాగా, వెయ్యి పరుగుల క్లబ్‌లో సమరవీర చోటు సంపాదించుకున్నాడు. మరో బ్యాట్స్‌మెన్ జయవర్ధన్ మరో ఎనిమిది పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయాడు.

సంక్షిప్త స్కోరు వివరాలు..
శ్రీలంక మొదటి ఇన్నింగ్స్‌ 416
న్యూజిలాండ్‌ మొదటి ఇన్నింగ్స్‌ 5 వికెట్లకు 159
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.