వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » చాముండేశ్వరినాథ్‌పై జీవితకాల బహిష్కరణ! (Women Cricketers | Vizag | Chamundeswarinath |)
 
మహిళా క్రికెటర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కార్యదర్శి వి.చాముండేశ్వరినాథ్‌పై ఏసీఏ జీవితకాల బహిష్కరణ వేటు వేసింది. విశాఖపట్నం క్రికెట్‌ స్టేడియంలో లైట్లు, కుర్చీల కొనుగోలులో చోటు చేసుకున్న కోట్లాది రూపాయల కుంభకోణం జరిగింది. అదేవిధంగా ఏసీఏ రికార్డుల ట్యాంపరింగ్‌, మహిళా క్రికెటర్ల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడినట్టు కార్యదర్శి చాముండిపై వచ్చిన ఆరోపణలతో ఏసీఏ సర్వసభ్య సమావేశం ఏకీభవించింది.

ఫలితంగా.. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌లో ఒకరిపై జీవితకాల బహిష్కరణ వేటు వేయడం ఇదే తొలిసారి. అంతేకాకుండా దేశ క్రికెట్‌ చరిత్రలోనే ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ పరువు, ప్రతిష్టలను మంటగలిపారని చాముండిపై ఏసీఏ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీఏ సర్వసభ్య సమావేశం విజయవాడలో గురువారం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షుడుతో సహా 39 మంది సభ్యులు హాజరయ్యారు.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.