పరిమిత ఓవర్ల క్రికెట్ మ్యాచ్ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. క్రికెట్‌కు పుట్టినిల్లు అయిన ఇంగ్లండ్‌లోనే 50 ఓవర్ల వన్డే మ్యాచ్‌ల భవితవ్యం సందేహాస్పదంగా మారింది. ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్ నుంచి వన్డే మ్యాచ్‌లను ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. 2010 సంవత్సరానికి గాను రూపొందించిన క్యాలెండర్‌లో వీటికి ఈసీబీ స్థానం కల్పించలేదు.
అలాగే.. 2011 ప్రపంచ కప్ తర్వాత వన్డే మ్యాచ్‌ల భవితవ్యంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సమీక్ష నిర్వహించాలని సూచన చేసింది. దేశవాళీ క్యాలెండర్ నుంచి వన్డే మ్యాచ్‌లను తొలగించేందుకు 12 నెలల పాటు ఈసీబీ అధికారులు సుధీర్ఘమంతనాలు, చర్చలు జరిపి ఎట్టకేలకు ఓ నిర్ణయానికి వచ్చారు. ఫలితంగా 2010 క్యాలెండర్‌లో వన్డేలకు చోటు లేకుండా పోయింది.