ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » ఇంగ్లండ్‌లో ఆసీస్‌కు ఆతిథ్యమివ్వనున్న పాక్ (Cricket | England | Pakistan to host Australia | Bangladesh | Summer Season)
2010లో రెండు అంతర్జాతీయ ట్వంటీ 20, రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌కు ఇంగ్లండ్‌లో ఆస్ట్రేలియాకు పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుంది. వచ్చే ఏడాది జూలై 5 నుంచి జూలై 25వ తేదీ వరకు జరిగే ఈ టెస్ట్ మరియు టీ-20 సిరీస్ కోసం ఆస్ట్రేలియాకు పాక్ ఆతిథ్యమివ్వనున్నట్లు ఇంగ్లండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్ధారించింది.
వేసవి సీజన్‌లో ప్రారంభమయ్యే ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను ఈసీబీ తన ప్రకటనలో తెలిపింది. ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌ల మధ్య జరిగే రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌తో ప్రారంభమయ్యే ఈ వేసవి సీజన్‌లో.. ఆ తర్వాత మూడు వన్డేల అంతర్జాతీయ సిరీస్ జరుగనుంది. దాదాపు 2010 సెప్టెంబర్ వరకు ఇంగ్లండ్ వివిధ అంతర్జాతీయ సిరీస్‌లతో పూర్తి షెడ్యూల్ ఖరారయింది.
కాగా, ఇంగ్లండ్‌లో 2010లో జరిగే అంతర్జాతీయ మ్యాచ్‌లు. సంబంధిత వివరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
ఇంగ్లండ్ వెర్సెస్ బంగ్లాదేశ్: మే 27 నుంచి జూన్ 17వ తేదీ వరకు ఇంగ్లండ్ వెర్సెస్ ఆస్ట్రేలియా: ఐదు అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు, జూన్ 22 నుంచి జూలై 3వ తేదీ వరకు పాకిస్థాన్ వెర్సెస్ ఆస్ట్రేలియా: రెండు అంతర్జాతీయ ట్వంటీ 20 మ్యాచ్‌లు, రెండు టెస్ట్‌లు, జూలై 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు. ఇంగ్లండ్ వెర్సెస్ పాకిస్థాన్: నాలుగు టెస్ట్‌లు జూలై 29 నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు, అలాగే ఐదు అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు మరియు రెండు అంతర్జాతీయ ట్వంటీ 20 మ్యాచ్‌లు సెప్టెంబర్ 5 నుంచి 21వ తేదీ వరకు.