వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » మళ్లీ క్రికెట్ ఆడటంపై ఫ్లింటాఫ్ అనుమానం (England | Andrew Flintoff | Knee injury)
 
మోకాలి గాయానికి శస్త్రచికిత్స చేయించుకొని ఇటీవల మైదానానికి దూరమైన ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్ర్యూ ఫ్లింటాఫ్ తిరిగి క్రికెట్‌కు దగ్గరవడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. మోకాలి గాయానికి ఫ్లింటాఫ్ శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ గాయం కారణంగా తన కెరీర్ ప్రమాదంలో పడవచ్చని ఫ్లింటాఫ్ భయపడుతున్నాడు.

తాను మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టే అవకాశాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉండాల్సివుంది. మోకాలి గాయం కారణంగానే ఇటీవల ఫ్లింటాఫ్ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాను చేయించుకున్న శస్త్రచికిత్స విజయవంతమయ్యే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. అయితే తనకు ఏదో మూల అంతర్జాతీయ క్రికెట్‌కు శాశ్వితంగా దూరమవతానని భయం ఉందని ఫ్లింటాఫ్ తెలిపాడు. 2015లో స్వదేశంలో జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ వరకు అంతర్జాతీయ కెరీర్‌ను కొనసాగించాలనుకుంటున్నానని గతంలో ఓ సందర్భంలో ఫ్లింటాఫ్ వ్యాఖ్యానించాడు.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.