వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » ప్రపంచకప్ మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడుతాం: పీసీబీ (Sports| Cricket| News| World Cup 2011| PCB| ICC | IPL-3)
 
ముంబై మారణకాండతో దాయాది దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో... భారత్‌లో జరగాల్సిన పాకిస్తాన్ ప్రపంచకప్ (2011) మ్యాచుల్ని, అక్కడ వీలు కాకుంటే శ్రీలంకలో ఆడతామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వెల్లడించింది.

దీంతోపాటు ఐపీఎల్-3లో పాక్ ఆటగాళ్లను భారత్‌లో ఆడేందుకు పాకిస్తాన్ అనుమతిస్తే ఇక ప్రపంచకప్ మ్యాచ్‌లకు కూడా అడ్డంకులు ఉండబోవని పీసీబీ భావిస్తోంది.

ఇప్పటికే భద్రతా కారణాలతో పాక్ ఆతిథ్యానికి దూరం కావడంతో భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లే ఇప్పుడు ప్రపంచకప్‌కు వేదికలయ్యాయి.

ఈ నేపథ్యంలో.. ప్రపంచకప్ (2011) వేదికను భారత్‌లో వీలుకాకుంటే శ్రీలంకలో జరుపుతామని ఇటీవల ఐసీసీ అధ్యక్షుడు డేవిడ్ మోర్గాన్‌తో జరిగిన భేటీలో పీసీబీ చీఫ్ ఇజాజ్ భట్ ఈ మేరకు తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు సమాచారం.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.