చాంపియన్స్ ట్రోఫీకి ఫిట్‌నెస్ సాధించిన గౌతం గంభీర్
గురువారం, 17 సెప్టెంబర్ 2009( 19:23 IST )
భారత క్రికెట్ జట్టు ఓపెనర్ గౌతం గంభీర్ ఫిట్‌నెస్ సాధించాడు. గురువారం నిర్వహించిన ఫిట్‌నెస్ పరీక్షల్లో గంభీర్ పాస్ అయినట్టు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధికారులు వెల్లడించారు. దక్షిణాఫ్రికా గడ్డపై ఈనెల 22వ తేదీ నుంచి మినీ ప్రపంచ కప్‌గా భావించే చాంపియన్స్ ట్రోఫీ ఆరంభంకానుంది.
అయితే, శ్రీలంక పర్యటనకు వెళ్లిన గంభీర్ గజ్జల్లో గాయం కారణంగా గాయపడ్డాడు. గత వారం రోజులుగా బెంగుళూరులోని జాతీయ క్రికెట్ అకాడెమీలో వైద్య చికిత్స చేయించుకున్న గంభీర్‌కు ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించగా, వాటిలో ఉత్తీర్ణులైనట్టు బీసీసీఐ ప్రకటించింది. దీంతో శుక్రవారం దక్షిణాఫ్రికా వెళ్లే టీమ్ ఇండియా వెంట గంభీర్ కూడా బయలుదేరి వెళ్ళనున్నాడు.