వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » డే అండ్ నైట్ టెస్టుల ప్రతిపాదనకు ఈసీబీ స్వస్తి! (England | drops | plans | day-night Test | Bangladesh | ICC | ECB | Cricket)
 
తమ దేశంలో డే అండ్ నైట్ టెస్టులను నిర్వహించాలని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు చేసిన ప్రతిపాదనను విరమించుకుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడం ఒక కారణం కాగా, గులాబీ రంగు బంతిని ఉపయోగంపై కూడా సందేహం ఏర్పడింది. దీంతో ఈసీబీ చేసిన ప్రతిపాదన విరమించుకుంది.

వచ్చే యేడాది మే నెలలో ఇంగ్లండ్‌లో పర్యటించే బంగ్లాదేశ్ జట్టుతో కలిసి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తొలి డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌ను నిర్వహించాలని తొలుత ప్రతిపాదించింది. దీనికంటే ముందుగా నాలుగు రోజులు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌ కోసం పింక్ రంగు బంతిని ఉపయోగించాలని భావించింది.

అయితే, ఈ బంతిని ఉపయోగించేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిరాకరించింది. ఫలితంగా, ఈసీబీ ప్రతిపాదనకు ఆరంభంలోనే అడ్డంకులు ఏర్పడ్డాయి. పైపెచ్చు.. ఐసీసీ నుంచి పెద్దగా ప్రోత్సాహం లభించలేదు. పైపెచ్చు.. టెస్టుల్లో మార్పులకు నిరాకరించింది. ఫలితంగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తన ప్రతిపాదనను విరమించుకుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.