ఛాంపియన్స్ లీగ్‌లో ఫేవరేట్లుగా దిగిన జట్లు ఒక్కోటిగా పేపరుకే పరిమితమవుతున్నాయి. స్టార్ బ్యాట్స్‌మన్‌లు ఎంతమంది ఉన్నా.. మైదానంలో బౌలర్లకు ధీటుగా సమాధానం చెబితేనే.. విజయం లేకపోతే.. ఇదిగో హెదరాబాద్ దక్కన్ ఛార్జర్స్‌లా చతికిలబడాల్సిందే. ఐపీఎల్- 2 టైటిల్ నెగ్గిన దక్కన్ ఛార్జర్స్ వంటి జట్టుపై సోమర్‌సెట్ సంచలన విజయం నమోదు చేసింది.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సోమర్‌సెట్ దక్కన్ ఛార్జర్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. శనివారం రాత్రి ఆఖరి బంతి వరకు ఈ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. దక్కన్ ఛార్జర్స్ తన స్థాయికి తగ్గట్టుగానే ఆరంభం అదరగొట్టింది. కెప్టెన్ గిల్‌క్రిస్ట్, లక్ష్మణ్ చక్కటి ఆరంభాన్నే ఇచ్చారు. కానీ వీరిద్దరి తర్వాత వచ్చిన బ్యాట్స్‌మన్‌లు ఎవరూ రాణించలేకపోయారు.
గిల్‌క్రిస్ట్ (18 పరుగులు) అనూహ్యంగా వెనుదిరగగా.. లక్ష్మణ్ (46) మెరిశాడు. రోహిత్ (21) వేణుగోపాలరావు (12)లు ఫర్వాలేదనిపించారు. దీంతో నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి దక్కన్ ఛార్జర్స్ 9 వికెట్ల నష్టానికి 153 పరుగులను చేసింది. ఇది చిన్న లక్ష్యమేమీ కాకపోయినా.. సోమర్‌సెట్ పెద్దగా భయపడలేదు.
దక్కన్ ఛార్జర్స్‌లో సరైన ఆరంభం లభించకపోయినా.. ఇంకా చెప్పాలంటే.. టార్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌లు రాణించపోయినా.. మిగిలిన వారు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. హిల్డ్రెత్ (25), థామస్ (17 బంతుల్లో 30)ల చక్కటి ఇన్నింగ్స్‌లో సోమర్‌సెట్‌కు కీలకమైంది.
ఓ దశలో 99 పరుగులకే ఏడు కీలకమైన వికెట్లు కోల్పోయి పరాజయం ముంగిట నిలిచిన సోమర్‌సెట్ అనూహ్యంగా హిల్డ్రెత్, థామస్‌ల ఇన్నింగ్స్‌తో కోలుకుంది. స్టార్ ఆటగాళ్లుగా పేరొందిన జస్టిన్ లాంగర్, ట్రెస్కోథిక్‌లు విఫలమయ్యారు. దక్కన్ ఛార్జర్స్ బౌలర్లలో ఆర్పీ సింగ్ మూడు వికెట్లు.. ప్రగ్యాన్ ఓఝా, స్కాట్ స్టైరిస్ రెండేసి వికెట్ల చొప్పున పడగొట్టారు.
ఏదేమైనప్పటికీ... ఒడిదుడుకుల మధ్య సోమర్‌సెట్ ఇన్నింగ్స్ సాగింది. అయితే చివరికి దక్కన్ ఛార్జర్స్‌పై తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. బౌలింగ్‌లో.. అటు బ్యాటింగ్‌లోను రాణించిన థామస్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. కాగా, ఈ విజయంతో సోమర్‌సెట్ ఏ గ్రూపులో రెండు పాయింట్లు సాధించింది.