ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » టెస్టుకు ఆతిథ్యం: స్టేడియం అద్దెపై యూపీసీఏ ఆందోళన (UPCA | frets | stadium rent | India-Sri Lanka Test | UP Govt | Cricket | BCCI)
భారత్-శ్రీలంక దేశాల మధ్య జరిగే టెస్ట్ సిరీస్‌కు ఆతిథ్యం ఇచ్చే స్టేడియం కోసం ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అన్వేషణ సాగిస్తోంది. కాన్పూర్‌లోని గ్రీన్ పార్కు స్టేడియం అద్దె కోటి రూపాయల వరకు ఉండటం యూపీసీఏను ఆందోళనకు గురి చేస్తోంది.
ముఖ్యంగా.. ఈ స్టేడియంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి చెందినది కావడం ఒక కారణం కాగా, అద్దె విషయంలో ప్రభుత్వం నిక్కచ్చిగా వ్యహరిస్తుండటం పెద్ద సమస్యగా పరిణమించింది. భారత్-శ్రీలంక దేశాల మధ్య మూడు టెస్టుల సిరీస్ వచ్చే నెలలో ఆరంభంకావాల్సి వుంది.
ఈ మూడు టెస్టుల్లో ఒక దానికి ఆతిథ్యం ఇచ్చేందుకు యూపీసీఏకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, గత యేడాది భారత్-దక్షిణాఫ్రికాల మధ్య గ్రీన్ పార్కు స్టేడియంలో వన్డే మ్యాచ్ జరుగగా, ఇందుకోసం యూపీ ప్రభుత్వం వసూలు చేసిన స్టేడియం అద్దె కోటి రూపాయలు. అయితే, టెస్టు మ్యాచ్ ఐదు రోజుల పాటు జరుగనుంది. అందువల్ల ఎంత మొత్తంలో అద్దెను డిమాండ్ చేస్తుందోననే ఆందోళన యూపీసీఏ వర్గాలను వేధిస్తున్నాయి.