ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » ఛాంపియన్స్ లీగ్: వీరవిహారం చేసిన వీరేంద్రుడు (Champion League | Sehwag | Kartick | Gambhir | Vayamba | Delhi)
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం జరిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ వీరవిహారం చేశాడు. క్రీజ్‌లో ఉన్నంత సేపు బౌండరీల వర్షం కురిపించాడు. మొత్తం 42 బంతులు ఎదుర్కొన్న వీరు.. పది బౌండరీలు, ఒక సిక్సర్ సాయంతో 66 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అలాగే, మరో బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ కూడా 41 బంతుల్లో మూడు సిక్సర్లు, ఐదు బౌండరీలతో 61 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.
ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో వయాంబా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో డేర్ డెవిల్స్ జట్టు గెలిచి తీరాల్సి వుంది. అందుకు తగ్గట్టుగా ఆ జట్టు బ్యాట్స్‌మెన్స్ పోటీపడి బౌండరీల వర్షం కురిపించారు. ఫలితంగా 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి టోర్నీలో తన ఆశలను సజీవంగా నిలుపుకుంది.
అంతకుముందు.. ఢిల్లీ డేర్‌డెవిల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఇందుకు సమాధానంగా వయంబా ఏడు వికెట్ల నష్టానికి 120 పరుగులు మాత్రమే చేయగలిగింది. మహేళా జయవర్ధనే 53 పరుగులు చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. నానెస్ 24 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు.