ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » న్యూజిలాండ్ సిరీస్‌కు యూనిస్ ఖాన్ సిద్ధం (Younis Khan | Newzealand Series | ready | Afridi | Pakistan Cricket Board)
న్యూజిలాండ్‌తో నవంబర్‌లో జరుగనున్న అంతర్జాతీయ వన్డే సిరీస్ సమయానికి పాకిస్థాన్ జట్టు కెప్టెన్ యూనిస్ ఖాన్ సిద్ధం అయ్యాడు. చేతి వేలి గాయం నుంచి కోలుకుంటున్న యూనిస్ ప్రస్తుతం నెట్ ప్రాక్టీసులో సైతం పాల్గొంటున్న పాక్ బోర్డు వర్గాల సమాచారం.
కరాచీలో యూనిస్ మాట్లాడుతూ, తాను గాయం నుంచి మెరుగ్గా కోలుకుంటున్నానని... న్యూజిలాండ్ సిరీస్‌కు తాను సిద్ధంగా ఉండగలనని వెల్లడించాడు. అయితే న్యూజిలాండ్‌తో జరిగే.. ట్వంటీ20 మ్యాచ్‌లో తాను ఆడనని వివరించాడు. ఈ మ్యాచ్‌కు యథావిధిగానే షాహిది అఫ్రిది కెప్టెన్సీ పగ్గాలు చేపడతాడన్నాడు.
తన ఫిట్‌నెస్‌పై ఎలాంటి సందేహాలు అవసరం లేదని.. న్యూజిలాండ్ సిరీస్‌కు సిద్ధం అవుతున్నట్లు పేర్కొన్నాడు. అంతకముందు.. యూనిస్ గాయం నుంచి ఇప్పుడే కోలుకునే అవకాశం లేదని.. దీంతో న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు అఫ్రిది సారథ్యం వహించే సూచనలున్నట్లు పాక్ బోర్డు వర్గాలు తెలిపాయి. అయితే అఫ్రిది ఈ వార్తలను ఖండించాడు.